జనవరి మాసాంతం వరకు అన్ని బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎంపిడిఓ లను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఉపాధిహామీ పథకం, హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు, మల్టీ లెవల్ అవెన్యూ ప్లాన్టేషన్, ఉపాధి హామీ పథకం లేబర్ మొబైలైజేషన్,  మొక్కలు జియో టాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, కార్యదర్శుల హాజరు, పంచాయతీలో  సీసీ ఛార్జిలు, ట్రాక్టర్ రుణాలు చెల్లింపు, 2వ డోస్ వాక్సిన్, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్వహణ తదితర అంశాలపై డిఆర్డీఓ, జడ్పి సీఈఓ, డీపీఓ, ఎంపిడిఓ, ఎంపిఓ, ఏపీఓ లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 58 చోట్ల బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలం అప్పగించడం జరిగిందని ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు.   వేసవిలో మొక్కలకు నీళ్లు లేక చనిపోతే అయిన ఖర్చులను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారం ఎంపిడిఓ ల నుండి వసూలు చేస్తామని చెప్పారు.  ఎండలు వల్ల మొక్కలు చనిపోవడానికి అవకాశం ఉన్నందున విద్యుత్తు, స్ప్రిక్లర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నర్సరీల్లో 80 లక్షల మొక్కల పెంపకం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 25 లక్షల విత్తనాలు నాటారని, ఇపుడు పెడితే మంచి ఎత్తు మొక్కలు వస్తాయని చెప్పారు. ఈ వారం నుండి ఉపాధి పనులు వేగవంతం చేయాలని, కూలీల హాజరుపై జిపి వారిగా ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని డిఆర్డీఓ కు సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలకు ఇచ్చిన 58 చోట్ల ఈ నెలాఖరు వరకు మొక్కలు వేయు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు.బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటును ప్రజలు తెలుసుకుని వినియోగించుకునేందుకు బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఎక్కడా బోర్డ్స్ కనిపించడం లేదని, ఆలోచన చేయాలని చెప్పారు.  ఉపాధి హామీ పథకం పనుల గురించి ప్రస్తావిస్తూ ప్రతి గ్రామ పంచాయతీ నుండి 50 మంది కూలీలు పనులకు వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.  50 మందిని కూడా పనులకు తీసుకురాలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీవోలు కార్యదర్శులపై పర్యవేక్షణ లేకుండా పోయిందని అందువల్ల కూలీల   మొబలైజేషన్ తగ్గిపోయిందని చెప్పారు.  ఉపాధి హామీ పథకం డిమాండ్ నోటీస్ జనరేట్ చేయడంలో తప్పుడు నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యదర్శులతో పని చేపించండి, మీరు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు.  మేజర్ రోడ్స్ లో గ్యాప్స్, రీ ప్లేస్మెంట్ లెక్కలు తీసుకోవాలని డిఆర్డీఓ కు సూచించారు.  పాల్వంచ లో అవెన్యూ, మీడియన్ ప్లాన్టేషన్ బాలేదని ఇంప్రూవ్ చేయాలని చెప్పారు. మీడియన్ మధ్యలో మల్టీ పర్పస్ పూల మొక్కలు వేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో డిఆర్డీఓ మధుసూదన్ రాజు, సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్, అన్ని మండలాల ఎంపిడిఓ లు, ఎంపీఓలు, ఏపీఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post