జనవరి 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ – 8 కార్యక్రమంలో అధికారులంతా సమన్వయంతో పాల్గొని బాల కార్మికులను, భిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన, ఆపదలో ఉన్న పిల్లలను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పత్తి తెలిపారు.

మంగళవారం నాడు స్థానిక భువనగిరి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ – 8 సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, బాలకార్మికులు, బస్టాండ్లు రైల్వే స్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్న చిన్నారులు, ఫ్యాక్టరీలలో,  కిరాణా దుకాణాలు, వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలలో ఆశ్రయం కల్పించడం చేయాలని, వారికి విద్య, వసతి సౌకర్యం కల్పించాలని తెలిపారు.
ఆపరేషన్ స్మైల్ -8  సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి కె.వి కృష్ణవేణి,  మాట్లాడుతూ జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జనవరి మాసం అంతా నిర్వహించబోతున్నామని, బాలకార్మికులు, బాల్యవివాహాలు, భిక్షాటన, తప్పిపోయిన బాలలు, ఆపదలో ఉన్న బాలలను గుర్తించి వారికి రక్షణ కల్పించేందుకు గాను సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ల  అధికారుల సమన్వయంతో  బాలల రక్షణకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా ఉన్న పిల్లల డేటాను దర్పణ్ యాప్ లో నమోదు చేయడం ద్వారా తప్పిపోయిన బాలలను వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరుగుతుందని తెలిపారు.
బాలల సంక్షేమ సమితి చైర్మన్ శ్రీమతి బండారు జయశ్రీ  మాట్లాడుతూ, రెస్క్యూ చేయబడిన ప్రతి పిల్లవాడిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరిచినట్లైతే వారి రక్షణ నిమిత్తం తగిన చర్యలు చేపడతామని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి స్వచ్చంద సంస్థలు, అన్నీ శాఖల అధికారులు సహకరించిన యెడల బాల కార్మికులు లేని బాలల స్నేహ పూర్వక జిల్లాగా తీర్చిదిద్దుదామని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నరసింహ, జిల్లా కార్మిక శాఖ అధికారి వాల్యా నాయక్ , జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ్,  CWC సభ్యులు ఎర్ర శివరాజు, కునాగల్ల మల్లేశ్, ఇస్తారి, రుద్రమదేవి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు, NCLP డైరెక్టర్ కుమార స్వామి, ఆపరేషన్ స్మైల్ టీం SI లు రామకృష్ణా రెడ్డి, మొహినుద్దీన్, రాధిక, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జనవరి 1 నుండి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ – 8 కార్యక్రమంలో అధికారులంతా సమన్వయంతో పాల్గొని బాల కార్మికులను, భిక్షాటన చేస్తున్న, తప్పిపోయిన, ఆపదలో ఉన్న పిల్లలను గుర్తించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పత్తి తెలిపారు.

Share This Post