జనవరి 1, 2022 నాటికి 18 సంత్సరాలు నిండిన వారందరిని ఓటరు జాబితాలో చేర్చాలి::ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యం.వీరబ్రహ్మయ్య ఐఏఎస్

ప్రచురణార్థం.2 తేదిః 06-11-2021

జనవరి 1, 2022 నాటికి 18 సంత్సరాలు నిండిన వారందరిని ఓటరు జాబితాలో చేర్చాలి::ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యం.వీరబ్రహ్మయ్య ఐఏఎస్

జనవరి 1, 2022 నాటికి 18 సంత్సరాలు నిండిన వారందరిని ఓటరు జాబితాలో చేర్చాలి::
ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యం.వీరబ్రహ్మయ్య ఐఏఎస్


జగిత్యాల, నవంబర్ 06: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు వయసు వచ్చే యువతి, యువకులను ఓటరు జాబితాలో చేర్చాలని జగిత్యాల జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్టర్వర్ యం. వీరబ్రహ్మయ్య, ఐఏఎస్ అన్నారు. వివిధ పొలిటికల్ పార్టీలకు చెందిన ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందింలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అబ్జర్వర్ మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా గుర్తించాలని, చనిపోయిన వారిని గుర్తించి ఓటరు జాబితా నుండి తొలగించాలని అదేవిధంగా తప్పులు దోర్లిన, బదిలి అయిన ఓటర్లను గుర్తించి బిఎల్ఓలు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

ఈ రోజు ఉదయం జిల్లాలో తనిఖీ చేసిన 4 పోలింగ్ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించగా, అధికారులు బాగా పనిచేస్తున్నారని, ఓటరు జాబతా నిర్వహణ ఎవిధంగా చేయాలి, తప్పులను ఏ విధంగా సరిచేయాలి అనే మొదలగు అంశాలపై పూర్తి స్పష్టంగా ఉన్నారని పేర్కోన్నారు. గ్రామంలో బిఎల్ఓల వద్దకు వెల్లి ఓటరు వివరాలను సరిచూసుకోవాలని పేర్కోన్నారు.

గ్రామపంచాయితికి సంబంధించిన ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం వారు తయారు చేసే జాబితా ఆదారంగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ వారు నిర్వహిస్తారని, గ్రామపంచాయితీ ఎన్నికలకు రెండు నెలల సమయం ముందు ఓటరు జాబితాను విడుదల చేస్తారని అప్పడు జాబితాలో తప్పిపోయిన, సరిచేయాల్సిన ఓటరు జాబితా వివరాలపై చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. ఓటరు జాబితాలో తప్పులకు, డూప్లికేట్ లకు అస్కారం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారిని గుర్తించి ఓటరు జాబితా నుండి పేర్లను తొలగించాలని అధికారులను అదేశించారు.

జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా వారిచే వచ్చే జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండుతాయో వారిని ఓటరుగా ఎంపిక చేయడం, చనిపోయిన వారిని జాబితా నుండి తొలగించడం, మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తుందని పేర్కోన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అధికారుల ద్వారా స్పేషల్ సమ్మరి రివిజన్ ఏర్పాటు చేసి 2022, 1 నవంబర్ నాడు డ్రాప్ట్ ఎలక్టోరోల్ డ్రాప్టులను ఇవ్వడం జరిగిందని, జగిత్యాల జిల్లాలో 5 నియోజక వర్గాలు ఉన్నప్పటికి జిల్లా కలెక్టర్ 3 నియోజక వర్గాలకు మాత్రమే జిల్లా ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారని, వేములవాడ, చోప్పదండి నియోజక వర్గాలకు సంబంధిత జిల్లా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారని పేర్కోన్నారు.

మూడు నియోజక వర్గాలలోని 785 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారులు ఉన్నారని, ప్రతి 10 నుండి 12 పోలింగ్ కేంద్రాలకు సూపర్ వైజరి అధికారులను కూడా నియమించడం జరిగిందని, వారు బుత్ లెవల్ అధికారుల పనితీరును సమీక్షిస్తారని పేర్కోన్నారు. నవంబర్ 1, 2021 నుండి నవంబర్ 30, 2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరుగుతుందని, నవంబర్ 6, 7, 27 మరియు 28 తేదిలలో స్పేషల్ క్యాపేయిన్ డే నిర్వహించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజక వర్గాలకు ఆర్డీఓలను, ధర్మపురి నియోజక వర్గానికి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ ఎలక్ట్రో రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తారని పేర్కోన్నారు.
ఓటరు జాబితా ఆదారంగా జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ మొదటి, రెండవ విడత వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలక్ట్రోరోల్ తయారుచేసే జాబితా ఆధారంగా చిరునామా ప్రకారం బిఎల్ఓలు ఇంటింటి సర్వే ద్వారా ఓటరు నివాసం మొదలకు అంశాలను పరిశీలించడంతో పాటు మొదటి, రెండవ విడత వ్యాక్సినేషన్ పై స్పష్టతను తీసుకొవడం జరుగుతుందని పేర్కోన్నారు.

డ్రాప్ట్ ఎలక్ట్రోరోల్ ప్రచురితం కాక ముందు నుండి జిల్లాలో 14 మండలాలలో 13644 డెత్ కేసులను గుర్తించడం జరిగిందని, ఫైనల్ రోల్ పూర్తిచేసే నాటికి పూర్తిగా డెత్ కేసులను గుర్తించి తొలగించడం, మిస్ ప్లెస్, డబుల్ ఎంట్రి లను సరిచేయడం జరుగుతుందని పేర్కోన్నారు. సమస్యలను పరిష్కరించి ఫైనల్ రోల్ ను ప్రచురించడం జరుగుతుందని పేర్కోన్నారు.
బిఎల్ఓల వద్దకు వెళ్లి ఓటరు జాబితాలో పేర్లు, ఫోటోలు, చిరునామాలను సరిచూసుకోవాల్సిన బాద్యత ప్రతి పౌరునిదేనని, మున్సిపాలిటి వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓ ద్వారా సూపర్ వైజర్ల ద్వారా వెరిఫికేషన్ చేయించుకోవాలని, పట్టణానికి గ్రామాల నుండి వలస వచ్చిన వారిని గుర్తించి, వారి గ్రామంలోని ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయా సరిచూసుకొని చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

కళాశాలల వద్దకు వెళ్లి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరు నమోదు పక్రియను పూర్తిచేయాలని, జగిత్యాల నియోజక వర్గంలో 11711 కోరుట్ల నియోజక వర్గంలో 12000 ధర్మపురి 11506 మంది 18 సంవత్సరాలు నిండిన 2022 నాటిని అంచనా జనాబా వారిని గుర్తించడం జరిగిందని వారిని ఓటరుగా నమోదు చేసేలా చూడాలని అన్నారు. చనిపోయిన, బదిలి పొరపాట్లను సరిచేయడం మొదలగు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ, కోరుట్ల ఆర్డిఓ టి. వినోద్ కుమార్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాలచే జారిచేయనైనది.

Share This Post