ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, జనవరి – 16.
జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
*జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు
*కంటి వెలుగు క్యాంపులో ప్రజలు షెడ్యూల్ ప్రకారం వచ్చేలా ప్రణాళిక
*ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చర్యలు
*వాట్సాప్ గ్రూపుల ద్వారా సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ
*కంటి వెలుగు క్యాంపులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాలి
*కంటి వెలుగు విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సంపూర్ణ సహకారం అందించాలి
*కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి హరీష్ రావు
జనగామ జిల్లా, జనవరి – 16
జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు.
సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి , రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ ఈ సమీక్షలో పాల్గోన్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ,* సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమం అని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు.
జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలలో కలెక్టర్, డిఎంహెచ్ఒ వాట్సాప్ ద్వారా ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో ఉన్న వైద్య బృందాలు సమీప పట్టణాలు,మండల హెడ్ క్వార్టర్ లో నైట్ హాల్ట్ చేసేలా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని, ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్.పి లు, విఒఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజలు ఉదయం , మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు.ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఎంపిఒ, ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజూ వారి పరిధిలో గల క్యాంపులను తనిఖీ చేయాలని, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేసినందున అధికంగా ప్రజలకు కంటి వెలుగు క్యాంపులు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రజలకు సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని , చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ,అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిసిపి సీతారాం, సంభందిత అధికారులతో మాట్లాడుతూ, కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసే విధంగా సంబంధిత అధికారులకు లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో కంటి వెలుగు క్యాంపుల షెడ్యూల్ తెలియజేస్తూ అవసరమైన భద్రత కల్పించాలని పోలీస్ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 8-30 గంటల వరకు తప్పనిసరిగా కంటి వెలుగు బృంద సభ్యులు క్యాంపు ప్రదేశానికి చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జనవరి 18న ప్రతి క్యాంపు ప్రదేశంలో ట్రయల్ రన్ నిర్వహించి, క్యాంపులకు అందించిన సామాగ్రి పనిని పరిశీలించి సర్టిఫై చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ సంబంధిత ప్రజాప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు.కంటి వెలుగుల నిర్వహణపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు,కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8247847692 రెండు షిఫ్టులవారీగా ఉదయం ఏడు గంటల నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఏదైనా సందేహాలు ఉంటే ఈ కంట్రోల్ రూమ్ లో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ. మహేందర్, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. రాం రెడ్డి, జిల్లా పంచాయతి అధికారి వసంత, మున్సిపల్ కమిషనర్ జె.రజిత, జిల్లా ఉప వైద్య అధికారులు డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ అశోక్, కంటి వెలుగులు ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.