జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకను ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను చే పట్టుటకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి జిల్లా అధికారులను ఆదేశించారు

ప్రచురణార్థం
21.01.2022 (శనివారం)

జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకను ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా విజయవంతంగా నిర్వహించడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులకు కేటాయించిన పనులను చే పట్టుటకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి జిల్లా అధికారులను ఆదేశించారు

శనివారం రోజున జనవరి 26 రిపబ్లిక్ డే ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ముందస్తు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వివిధ శాఖలు కేటాయించిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిపబ్లిక్ డే నిర్వహణ కలెక్టర్ కార్యాలయాల్లో గాని, వరంగల్ కుష్ మహల్ హల్ లో గాని ఈ రెండు చోట్లలో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ముఖ్యఅతిథి ప్రసంగం సాంస్కృతిక కార్యక్రమాలు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసే విధంగా చూడాలని డి పి ఆర్ ఓ ను ఆదేశించారు
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సర్టిఫికెట్స్ ప్రజెంటేషన్ విషయాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి డిపిఆర్ఓ సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు

పోలీస్ శాఖ ద్వారా గాడ్ ఆఫ్ ఆనర్ బందోబస్తు ఏర్పాటు లపై చర్యలు తీసుకుంటున్నట్లు అలాగే వేడుక జరిగే ప్రదేశాన్ని చదును చేయడం, స్టేజ్ డెకరేషన్, ఇలా ఆయా శాఖలకు కేటాయించిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు

ఈరోజు సమావేశం లో అదనపు కలెక్టర్ లు
అశ్విని తానాజీ వాకాడే , శ్రీవత్సవ కోట , డిసిపి వెంకటలక్ష్మి ఆర్డీవో మహేందర్ జి డి ఆర్ డి ఎ పి డి సంపత్ రావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు

Share This Post