జనవరి 5న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రచురణార్థం

*జనవరి 5న 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు*

**జనవరి 5న జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన*
—————————–
పెద్దపల్లి, జనవరి -04:
—————————
ధర్మారం మండలం నంది మేడారంలో నిర్మించు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జనవరి 5న గురువారం శంకుస్థాపన చేయనున్నారు.

జనవరి 5న మధ్యాహ్నం 3-45 గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం నుంచి మంత్రి హరీష్ రావు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి సాయంత్రం 4-15 నిమిషాలకు ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చేరుకుంటారు. నంది మేడారం గ్రామంలో నిర్మించనున్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన తదుపరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం సాయంత్రం 5-30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు మంత్రి బయలుదేరీ వెళతారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post