జనవరి 5, 2022 న ప్రకటించనున్న ఓటరు తుది జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పోలింగ్ కేంద్రాలు మార్పులు, చేర్పులు, నూతన కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలపై నియోజకవర్గ కేంద్రాల సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముసాయిదా డ్రాఫ్ట్ రోల్ నవంబర్ 1వ తేదీన ప్రకటించడం జరుగుతుందని, తదుపరి అభ్యంతరాలను నవంబర్ 30వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఓటర్లు నుండి వచ్చిన అభ్యంతరాలను డిసెంబర్ 20వ తేదీ వరకు పరిష్కరించి జనవరి 5, 2022న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు ఆయన వివరించారు. ‘తప్పులు, తడకలు లేని సంపూర్ణమైన ఓటరు జాబితా తయారుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వర్ణలత, ఎన్నికల సెల్ పర్యవేక్షకులు రాజు, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు రామక్రిష్ణ, క్రిష్ణవేణి, శ్రీనివాసయాదవ్, ప్రసాద్, చంద్రశేఖర్, రాజకీయ పార్టీల నాయకులు బిఎస్పీ నుండి యం వీరూ నాయక్, బిఎస్పీ నుండి నోముల రమేష్, సిపిఐ మార్కిస్ట్స్ నుండి విజయ్్మహన్ సింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి రాజశేఖర్, టిఆర్ఎస్ నుండి కాసుల వెంకట్, టిడిపి నుండి ఏడి లాజరస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post