జనవరి,1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటరుగా నమోదు కావాలి :: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

పత్రికాప్రకటన.2 తేదిః 18-09-2021

జనవరి,1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటరుగా నమోదు కావాలి ::
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

జగిత్యాల, సెప్టెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని నూతన ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఏన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జనవరి,1-2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరిని ఓటరుగా నమోదు చేసుకునెలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా 2022 తుది ఓటర్ జాబితాను సిద్ధం చేయాలనీ. ఓటరు నమోదు ప్రక్రియను నిరంతర ప్రక్రియనగా కొనసాగిస్తూ, జనవరి,1-2022 కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ గా వారి పేరు నమోదు చేసుకునేందుకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటరు జాబితాలో ఎర్పడ పొరపాట్లను పూర్తిస్థాయిలో సవరించాలని, నవంబర్ 2021 ముసాయిదా ఓటరు జాబితా వెలువడుతుందని అట్టి జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని, డిసెంబర్ 20-2021 లోగా అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిష్కరించి జనవరి 05, 2022న తుది ఓటరు జాబితాను రూపొందిచాలని పేర్కోన్నారు. ఎపిక్ ఓటరు కార్డు కొరకు వచ్చిన ధరఖాస్తులను పరిష్కరించి, ఈ ఎపిక్ కార్డు ల డౌన్లోడ్ కు సహకరించాలని అన్నారు. స్వీప్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, చనిపోయిన వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లీటిరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఒటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి. రవి, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరణశ్రీ, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు మదు తదితరులు పాల్గోన్నారు.

జనవరి,1 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరు ఓటరుగా నమోదు కావాలి ::
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post