జనాభా గణన వివరాలు గ్రామ పంచాయతీ, మున్సిపల్, వార్డుల వారీగా పక్క గా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గ్రామ పంచాయతీల పరిధిలోని అనుబంధ గ్రామాల్లో జనాభా గణన వివరాలు తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 7న గణన పూర్తిచేయాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు గ్రామాల్లో పర్యటిస్తాయని చెప్పారు. పల్లె ప్రగతి నివేదికలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డులు వినియోగంలో ఉండేవిధంగా చూడాలన్నారు. గ్రామాల్లోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. శ్రీ నిధి రుణాలు నిరుపేద మహిళలకు ఇప్పించాలని ఐకెపి అధికారులను కోరారు. ఉపాధి హామీ కూలీలను 100% ఈశ్రమ్ లో నమోదు చేయించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, శ్రీనిధి రీజినల్ మేనేజర్ రవికుమార్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చేజారీ చేయనైనది.

Share This Post