జనాభా లెక్కల సేకరణ 2021 లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ గ్రామం యూనిట్ గా, అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు యూనిట్ గా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహశీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, సహాయ గణాంక అధికారులకు జనాభా లెక్కలు 2021 సేకరణ గురించి వివరించారు.  భారతదేశంలో చేసే ఒక గొప్ప కార్యక్రమం జనాభా లెక్కల సేకరణ అన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి వివరాలు జనాభా లెక్కల లోకి తీసుకోవాలని ఎన్యుమరేటర్లు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని  సూచించారు. జనాభా లెక్కలు 2021 కి సంబంధించిన గైడ్ లైన్స్ ను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా సంబంధిత ప్రొఫార్మా లలో వివరాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. అధికారులు ఎక్కడ పొరపాట్లు చేయరాదని ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తేవాలని సూచించారు. గతంలో చేసిన జనాభా లెక్కలకు సంబంధించిన ఛార్జ్ రిజిస్టర్లు బ్లాకుల వారిగా పరిశీలించి 2011 జనాభా లెక్కల కు అవసరమైన బ్లాక్ లు, హద్దులు, రెవెన్యూ గ్రామాలు, మున్సిపల్ వార్డులను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాన్ కార్డ్ స్టేట్మెంట్ లలో గ్రామీణ ప్రాంతాలకు ప్రొఫార్మా 1, అర్బన్ ప్రాంతాలకు ప్రొఫార్మా 2గా నిర్ధారించారని ఆయన తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు డ్రాఫ్టులను సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
 కాన్ఫరెన్స్ లో చిట్యాల, నకరేకల్ ,నందికొండ, అనుముల , చండూరు తహశీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్ లను సందేహాలను అడిగి తెలుసుకొని వారి సందేహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ నివృత్తి చేశారు.
జనాభా లెక్కల నిర్వహణకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి అధికారి పి వి సుబ్రహ్మణ్యం వర్క్ షీట్లను ఎలా నింపాలి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ కృష్ణమూర్తి,ఎన్నికల డి.టి.విజయ్ తదితరులు పాల్గొన్నారు.
జనాభా లెక్కల సేకరణ 2021 లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ గ్రామం యూనిట్ గా, అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు యూనిట్ గా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ అధికారులకు సూచించారు

Share This Post