జనావాసాల మధ్య పందుల సంచారం లేకుండా ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు డయల్ యువర్ కలెక్టర్ నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సమస్యలను నమోదు చేసినట్లు ఆయన వివరించారు. పాల్వంచలో పందుల సమస్య అధికంగా ఉన్నదని, పంటలను నాశనం చేస్తున్నాయని, జనావాసాల మధ్య సంచరించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఫోన్ రాగా తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. జనావాసాలకు దూరంగా పందుల పెంపకం చేపట్టాలని, జనావాసామద్య కాదని తక్షణమే నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. 1001 రకం ధాన్యం కొనుగోళ్లులో జాప్యం జరుగుతున్నదని, తరుగు తీస్తున్నారని రైతులు ఫోన్ ద్వారా సమస్యను తెలియచేయగా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పారు. తరుగు పేరుతో రైతుకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే 1001 రకపు ధాన్యాన్ని ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడొద్దని చెప్పారు. సమస్య పరిష్కారానికి అదనపు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని. చెప్పారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 56 మంది ఫోన్ ద్వారా సమస్యను వివరించారని, అట్టి సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు కొన్ని::

 

టేకులపల్లి మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన అరుణకుమారి తన మామ పేరున ఉన్న భూమిని ఇతరుల పేరున పట్టా జారీ చేశారని, రైతుబంధు కూడా తీసుకుంటున్నారని, విచారణ నిర్వహించి పట్టాదారు పాసుపుస్తకం మంజూరుతో పాటు రైతుబంధు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన పిర్యాదను తహసిల్దార్ విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు. పాల్వంచ పట్టణానికి చెందిన మహ్మద్ జమాలుద్దీన్ దివ్యాంగుడైన తనకు జీవనాధారం కొరకు కిరాణా దుకారం ఏర్పాటుకు బ్యాంకు నుండి రుణం మంజూరు చేపించాలని చేసిన పిర్యాదుకు స్పందించిన కలెక్టర్ తక్షణమే అతనికి రుణం మంజూరు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్జియంకు సూచించారు.

 

అశ్వారావుపేటకు చెందిన భావన, మరి కొందరు గతంలో విద్యాశాఖలో వాలంటీరుగా పనిచేశామని, చేసిన 3 నెలల కాలానికి వేతనం మంజూరు చేపించాలని చేసిన సమస్యపై కలెక్టర్ స్పందిస్తూ తక్షణమే నిధుల మంజూరుకు విద్యాశాఖ కమిషనర్తో మాట్లాడి సమస్య. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

కొత్తగూడెం మున్సిపాల్టీ 2వ వార్డుకు చెందిన ఎస్కే సంధాని వార్డులో 30 సంవత్సరాల క్రింత రహదారి నిర్మించారని, అది పూర్తిగా మరమ్మత్తులకు గురికాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నూతనంగా రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని చేసిన పిర్యాదుకు స్పందించిన కలెక్టర్ ప్రతి పాదనలు తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు.

 

చుంచుపల్లి మండలం, పెనగడప గ్రామానికి చెందిన యాసిన్ తన భర్త మరణించి 5 సంవత్సరాలు దాటిందని, వితంతు పించను మంజూరుకు ధరఖాస్తు చేసుకున్నానని, పించను మంజూరు చేయాలని చేసిన పిర్యాదుపై తక్షణమే పోర్టల్లో పరిశీలన చేసి ఆమెకు సమగ్ర సమాచారం అందచేయాలని డిఆర్డిఓకు సూచించారు.

 

పాల్వంచ పట్టణం, నవభారత్కు చెందిన బిక్షాలు మన ఇసుక వాహనం ద్వారా ఇసుక కొనుగోలుకు నిధులు చెల్లించామని, నేటి వరకు ఇసుక రాలేదని, ఇసుక కానీ నగదు కానీ తిరిగి చెల్లింపులు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయగా వారం రోజుల్లో సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

పినపాక మండలం, చిక్కుడుగుంతకు చెందిన ఎస్ విజయలక్ష్మి ఫారం 6 సమర్పించకపోవడం వల్ల బిటిపిఎస్ లో ఉద్యోగ కల్పనకు ఇబ్బంది పడుతున్నామని, ఫామ్ 6 మంజూరు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయగా తక్షణమే తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 

 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు

తదితరులు  పాల్గొన్నారు..

Share This Post