జమ్మికుంట మండల కేంద్రంలోని సూపర్ మార్కెట్ ను పరిశీలించి అనంతరం జమ్మికుంట మండలం కొరపల్లి, లో దళిత బంధు పథకం కింద మంజూరైన డెయిరీ యూనిట్ షెడ్ ను ప్రారంభించిన లబ్ధిదారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న RDO రవీందర్ రెడ్డి. (కరీంనగర్ జిల్లా)

 

దళిత బంధు పథకం యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలి
దళితబంధు యూనిట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
000000
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యూనిట్లను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. శనివారం జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో డెయిరీ యూనిట్ ను, జమ్మికుంట మండల కెంద్రంలో మహేశ్వరి సూపర్ మార్కెట్ యూనిట్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కోరపల్లిలో ఈర్ల మల్లమ్మ-కొమురయ్య దంపతులు దళిత బంధు పథకం కింద స్థాపించిన డెయిరీ యూనిట్ ను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని పాడి గేదెలు తెచ్చుకున్నారు, రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయని వారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వారు ఈ సందర్భంగా ఒక్కొక్కటి ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు పాలు ఇస్తున్నాయని తెలిపారు. దగ్గరలోని విజయ డెయిరీకి పాలు పోస్తున్నామని వారు తెలిపారు. డెయిరీ షెడ్డులో ఏర్పాటు చేసిన 3 ఫ్యాన్లను పరిశీలించారు. ఫ్యాన్లు ఎందుకు పెట్టారని వారిని కలెక్టర్ ప్రశ్నిచారు. ఫ్యాన్లు పెట్టడం వలన గేదెలను దోమలు కుట్టకుండా కాపాడుతాయని వారు కలెక్టర్ కు వివరించారు. పాడి గేదెలకు మంచి పౌష్టికాహార ధాణ పచ్చిగడ్డి వేస్తే అధిక పాలు ఇస్తాయని అన్నారు. డెయిరీ యూనిట్ల ద్వారా లబ్దిదారులకు వెంటనే ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దళీత బంధు లబ్దిదారులు డెయిరీ యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చి స్థాపించుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొంది ఆర్థికాభివృద్ది సాధిస్తారని సూచించారు. దళిత బంధు పథకం ద్వారా డెయిరీ యూనిట్లు స్థాపించుకున్న లబ్దిదారులకు గడ్డి విత్తనాలు అందించాలని కలెక్టర్ పశువైధ్యాధికారిని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని వృద్దులతో కలెక్టర్ మాట్లాడుతూ నెల నెల ఆసరా పించన్లు, రేషన్ బియ్యం సకాలంలో సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మీరు అందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారా అని అడుగగా తీసుకున్నామని వారు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ విస్తృతంగా వ్యాపిస్తుందని అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని కలెక్టర్ వారికి సూచించారు. అనంతరం జమ్మికుంట మండలం కెంద్రంలో బాజుల సంధ్య- గంగయ్య దంపతులు స్థాపించిన మహేశ్వరి సూపర్ మార్కెట్ యూనిట్ ను కలెక్టర్ సందర్శించారు. యూనిట్ ద్వారా వస్తున్న ఆదాయం గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల పెట్టుబడి ఖర్చులు పోనూ రూపాయలు 10 వేల ఆదాయం పొందుతున్నామని బాజుల సంధ్య- గంగయ్య దంపతులు కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూపర్ మార్కెట్ లో సామాగ్రిని పరిశీలించారు. కష్టపడి దళిత బంధు ద్వారా మంజూరైన యూనిట్లను సక్రమంగా నడిపించుకుంటూ ఆర్థికాభివృద్ది సాధించాలని అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల ఆర్థికాభిఫృద్ది సాధనపై కన్న కలలు నిజమవుతాయని అన్నారు. అనంతరం జమ్మికుంట మండల కెంద్రంలో గుల్లి సుగుణ-మొగిలి దంపతులకు దళిత బంధు యూనిట్ పథకం ద్వారా మంజూరైన అశోక్ లేలాండ్ (బడా దోస్త్) వాహనాన్ని పరిశీలించారు. వాహనాన్ని మంచిగా నడిపించుకుంటూ ఆదాయం పొందాలని కలెక్టర్ వారికి సూచించారు.

Share This Post