జమ్మి మొక్క నాటిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 5: ముఖ్యమంత్రి స్పూర్తితో, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా శ్రీ సంతోషిమాత ఆలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటి, నీరు పోశారు. జమ్మిచెట్టు చాలా పవిత్రమైనదని, ప్రతి దేవాలయంలో జమ్మిచెట్టు ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అర్చకులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా డిఆర్డీవో జి. రాంరెడ్డి, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయకర్త చాట్లపల్లి పురుషోత్తం తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post