జయశంకర్ సార్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి . రూరల్ జిల్లా కలెక్టర్ హరిత.

ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ని పురస్కరించుకుని వరంగల్ రూరల్ కలెక్టరేట్లో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.శుక్రవారం రూరల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఎం హరిత జయశంకర్ జయశంకర్ చిత్రపటానికి పుష్ప మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విద్యార్థి దశ నుండే తెలంగాణ కోసం ఎంతో శ్రమించారని, వారి ఆశయాలను ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.వారికని ఎల్లప్పుడూ స్మరించుకోవడానికి జయశంకర్ సర్ పేరును ఒక యూనివర్సిటీ కి మరియు జిల్లాకు పెట్టి ప్రభుత్వం తన ప్రత్యేకథను చాటింది అని అన్నారు.జయశంకర్ సార్ ఆశయసాధనకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రాజేంద్రనాథ్, కలెక్టరేట్ సిబ్బంది జి సదానందం,టి శ్రీకాంత్, ఏవి భాస్కర్, ఆర్.జి నాగరాజు,పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Share This Post