జల శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాననీటి సంరక్షణపై జూమ్ సమావేశం : జల శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:28.01.2022, వనపర్తి.

వాన నీటిని నిల్వ చేయటం ద్వారా భూగర్భ జల మట్టం లభ్యత పెరిగి సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని జల శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఢిల్లీ నుండి జల శక్తి అభియాన్ మిషన్ డైరెక్టర్ వాననీటి సంరక్షణ పద్ధతుల (Rain Water Harvesting) పై జూమ్ సమావేశం ద్వారా ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు ప్రతి నీటి బొట్టును నిల్వ చేసి, వాటిని సంరక్షించాలని, ఇందుకు తగు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. వాననీరు నిల్వ చేయటం ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుందని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా భూగర్భ జల మట్టం తక్కువ లోతులో లభ్యమవుతుందని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపడుతున్న పథకాల ద్వారా సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, హరితహారం ద్వారా మొక్కలు నాటడం,. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ వాననీటి సంరక్షణ చర్యలు, రైతుల వ్యవసాయ పద్ధతులలో ఆధునిక విధానాలను అవలంబించడం వంటి చర్యల ద్వారా వాన నీటిని సంరక్షిస్తున్న ట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ సమావేశంలో గ్రౌండ్ వాటర్, జియాలజిస్ట్ డి.డి. యుగేందర్ రెడ్డి, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. కృష్ణయ్య, పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post