జాతిపిత మహత్మాగాంధీ జయంతి జరుపుకొనే అక్టోబర్ 2 వ తేదీన సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

జాతిపిత మహత్మాగాంధీ జయంతి  జరుపుకొనే అక్టోబర్ 2 వ తేదీన సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి MG రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను, బన్సీలాల్ పేట లోని మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ హాస్పిటల్ ముందు నూతన గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.  పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ హాస్పిటల్ ముందు 16 అడుగుల ద్యానంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆ పరిసరాలను ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం  2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. అతి పెద్ద గాంధీ విగ్రహం హాస్పిటల్ కు వచ్చే వారిని ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. అదేవిధంగా ఎంతో చరిత్ర కలిగిన MG రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద కూడా అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, పనులు ముగింపు దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ రెండు విగ్రహాలను కూడా అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. మెట్లబావి పునరుద్దరణ, పరిసరాలలో వివిధ వివిధ అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం పూర్తిగా కొత్తదనంతో కనిపిస్తుందని చెప్పారు. అంతేకాకుండా మెట్లబావి పరిసరాలలోని అన్ని భవనాలకు ఒకే విధమైన  రంగు వేసే పనులు సాగుతున్నాయని, ఇవి పూర్తయితే మరింత ఆకర్షణీయంగా మెట్లబావి పరిసరాలు మారనున్నదని చెప్పారు.  ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుందరెడ్డి, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, కల్పన,  HMDA అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post