జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి  మహాత్ముని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ.  నాగేశ్వరా చారి, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న మహాత్ముని విగ్రహానికి జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post