జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్

జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి

జిల్లా కలెక్టర్ అర్. వి. కర్ణన్

00000

     జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు.

     స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించిన గాంధీ చిత్రామును కరీంనగర్ పట్టణంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ కొద్దిసేపు తిలకించారు ఈ సందర్బంగా ఆయన జాతిపిత మహాత్మా గాంధీ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులను గాంధీ చిత్ర ప్రదర్శన ఈనెల 9,10,11 తేదీలతో పాటు 16,17,18,19,20,21 తేదీలలో కరీంనగర్ జిల్లా లోని 13 థియేటర్లలో గాంధీ చిత్రం ను చూపించడం జరుగుతుంది అని అన్నారు.. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు చలన చిత్రాలు చూపించాల్సి ఉంటుందని ఇందుకుగానూ పాఠశాల విద్యార్థులను బస్సు లలో తరలించి.. సినిమా వీక్షణ తరువాత మళ్లీ ఆ బస్సులలో పాఠశాలకు తీసుకొచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని అన్నారు . సినిమా హల్ లో పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్నీ చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. సినిమా హాలులో పారిశుధ్యం పాటించాలని, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు.

     ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Share This Post