జాతిపిత మహాత్మా గాంధీ 152వ. జయంతి సందర్భంగా ఘనంగా నివాలి : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:2. 10 .2021,  వనపర్తి

జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
శనివారం జాతిపిత మహాత్మా గాంధీ 152వ. జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి, అహింస బాపూజీ మార్గమని, ఆయన బాటలోనే ప్రతి ఒక్కరు నడవాలని ఆమె అన్నారు. శాంతియుతంగా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా వనపర్తి జిల్లాలో 20 గ్రామాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు 10  గ్రామాలలో ప్రభుత్వ సూచనల మేరకు 100 శాతం పనులు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. మిగిలిన పది గ్రామాలలో పనులు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్, సి పి ఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్ అండ్ బి ఈ. ఈ.  దేశ నాయక్,  తాసిల్దార్ రాజేందర్ గౌడ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు..
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారీ చేయడమైనది.

Share This Post