జాతి గర్వపడే విధంగా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే వారు ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                                   తేది:5- 9- 2021

జాతి గర్వపడే విధంగా ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే వారు ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

ఆదివారం మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం  గద్వాల పట్టణంలోని బాల భవన్ లో  ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారితో  పాటు జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య హాజరై జ్యోతిని వెలిగించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని ఉత్తమ  పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల దేనని అన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల వేడుకలు నిర్వహించు కోలేక పోయామని, ఈసారి కోవిడ్ నిబంధనలతో వేడుకలు జరుపుకుంటున్న మని అన్నారు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో నిలిచాడు అంటే  దాని వెనక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుతం పాఠశాలలు తెరిచారని ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి పాఠశాలకు రావాలని సూచించారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబందనల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఏవైనా వైద్య సమస్యలు వస్తే సంబంధిత వైద్య అధికారిని  సంప్రదించాలన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థి వ్యాక్సిన్ తప్పనిసరిగా    వేయించుకోవాలని  సూచించారు. ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల హాజరు శాతం పై దృష్టి పెట్టి, ప్రజా ప్రతినిదుల సమన్వయము తో విద్యార్తుల తల్లి తండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలకు అందరు వచ్చేలా చూడాలని,  ఆరోగ్యవంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యతో పాటు నైతిక , సామాజిక విలువలు నేర్పించాలని అన్నారు.   పాఠశాలలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా సబ్జెక్టుపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విజయం వెనక వారి గురువుల ప్రముఖ స్థానం ఉందని, ప్రతి ఒక్కరు గురువులను విస్మరించరాదని అన్నారు. అటెండర్ స్థాయి నుండి కలెక్టర్  స్థాయి వరకు ఎదిగిన ప్రతి ఒక్కరు గురువు నేర్పిన విద్య తోనే ముందుకు వెళ్లారని అన్నారు. ఉత్తమ గురువులను సన్మానించడం మన అదృష్టమని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం విద్యాసంస్థల ప్రారంభమయ్యాయని కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరు పాఠశాలకు హాజరు కావాలని అన్నారు.

 ఈ సందర్భంగా జిల్లాలోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్ చేతుల మీదుగా శాలువా, ప్రశంసాపత్రం, మెడల్ తో ఘనంగా సన్మానం చేశారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్, భాను ప్రకాష్ , ఆయా పాఠశాలల హెడ్మాస్టర్ లు, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

——————————————————————————–

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి చేయబడినది.

Share This Post