జాతీయస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను అభినంధించిన కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం..2 తేదిః 22-11-2021
జాతీయస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను అభినంధించిన కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 22:

జాతీయస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను అభినంధించిన కలెక్టర్ జి. రవి

గత మూడు రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి. రవి అభినందించారు.
ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుండి 21 వరకు మూడు రోజుల పాటు18 రాష్ట్ర లకు చెందిన క్రీడాకారులతో నిర్వహించిన సీఎం కప్ -2021 జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న జగిత్యాల ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కి చెందిన కుమితే జూనియర్స్ విభాగంలో ప్రేమ్ బంగారు పథకం, టీం కటా విభాగంలో సౌమిత్, ప్రేమ్, చక్రి లు కాంస్య పథకం సాధించగా, ఇండివిజల్ కటా విభాగం లో వర్ష కాంస్య పథకం చక్రి వెండి పథకం, సాయిచరణ్ కాంస్య పథకం బాలికల సీనియర్స్ విభాగంలో శృతి కాంస్య సాధించినట్లు జిల్లా స్పోర్ట్స్ కరాటే – డో అసోసియేషన్ అధ్యక్షులు మర్రిపెల్లి శ్రీనివాస్ తెలిపారు.
కార్యాక్రమంలో జిల్లా స్పోర్ట్స్ కరాటే – డో అసోసియేషన్ అధ్యక్షులు మర్రిపెల్లి శ్రీనివాస్, సీనియర్ కరాటే మాస్టర్ చీఫ్ ఎగ్జామినర్ ఎం. లింగయ్య, టి.నరేష్, ఎ.కాంతారావు, ఆర్.రాము తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post