జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి…

ప్రచురణార్ధం

జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి.

మహబూబాబాద్, నవంబర్,03.

వైద్య సౌకర్యాలు మెరుగు పరిచేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా చేపడుతున్న కార్యకలాపాలు, సబ్ సెంటర్ల నిర్మాణాల ప్రగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద మార్చురీ లు నిర్మించుకోవచ్చని, కాన్పుల ప్రగతి చూపించగలిగితే డాక్టర్స్, సిబ్బందిని నియమించుకోవచ్చునన్నారు.

లెప్రసి, ఆర్.బి.ఎస్.కె.లతో పాటు 69 పల్లె దవఖానాలు ఏర్పాటుకు ఎంబీబీఎస్ డాక్టర్లతో చేపట్టగా 12మంది డాక్టర్లు నియామకం చేపడుతున్నామన్నారు.

18 వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయన్నారు.

నర్సింహులపేట, పెద్ద వంగర లలో ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని వైద్యాధికారులు కలెక్టర్ ఆదేశించారు.

అలాగే బలపాల, మరిపెడ లలో పాత పి.హెచ్.సి. భవనాల స్థానంలో నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

173 సెంటర్లు ఉండగా 35 పూర్తి కాగా 208గా ఉన్నాయన్నారు.
74 సబ్ సెంటర్లు చేపట్టగా 35 పూర్తి అయ్యాయని, మిగతా సబ్ సెంటర్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. త్రాగునీరుకు మిషన్ భగీరథ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ లు పొందాలన్నారు.

వ్యాక్సినేషన్ కు సంబంధించి కురవి,నెల్లికుదురు, దంతాలపల్లి వంటి మండలాల్లో మరింత వేగం పెంచాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, డిఆర్డీఓ
పీడీ సన్యాసయ్య, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పర్యవేక్షకులు వెంకట రాములు, ఆర్.అండ్.బి, టి.ఎస్.ఎమ్.ఐ.డి.సి.,ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post