జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు,ఓటర్ కిట్ అందచేసిన కలెక్టర్*

జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి18 సం. లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుండి జాతీయ ఓటర్
దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని ,ఈ రోజు 12 వ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
          ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని ఆయన అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని, 18  సంవత్సరాలు యువత ఓటరుగా  తమ పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితా  ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాలలో ప్రదర్శిస్తారని, ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్యవంతులను చేయుటలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ సందర్భంగా అందరిచే “భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మనదేశ ప్రజాస్వామ్యం సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము” అని ఓటర్ ప్రతిజ్ఞ జిల్లా కలెక్టర్ చేయించారు.ఈ సందర్భంగా 01-01-2022 వరకు 18 సంవత్సరములు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.
*రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన స్పెషల్ కేటగిరీ అవార్డులు అందచేసిన జిల్లా కలెక్టర్*
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బంధీగా  నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్.డి.ఓ.,ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫిసర్ రోహిత్ సింగ్ కు,కలెక్టరేట్ ఎన్నికల విభాగం డి.టి.విజయ్ లకు 15 వేల రూ.ల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. అట్టి అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,వి.చంద్ర శేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, జడ్.పి.సి.ఈ. ఓ వీరబ్రహ్మ చారి,జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీ లాల్, సూపరింటెండెంట్ కృష్ణ మూర్తి,నల్గొండ తహశిల్దార్ నాగార్జున, ఎన్నికల డి.టి.విజయ్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.                  ——————————
 సహాయ సంచాలకులు, జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం నల్గొండ వారిచే జారీ చేయడమైనది.
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులు,ఓటర్ కిట్ అందచేసిన కలెక్టర్*

Share This Post