జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సాఫ్ట్ వేర్ మారుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వవహించిన.పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ది శాఖ కమిషనర్ డా. ఏ. శరత్.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సాఫ్ట్ వేర్ మారుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వవహించిన.పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ది శాఖ కమిషనర్ డా. ఏ. శరత్.

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, జనవరి 22:
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డా. ఏ. శరత్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీరాజ్ అధికారులతో శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సాఫ్ట్ వేర్ మారుతున్నందున తీసుకోవాల్సి చర్యలపై కమీషనర్ సమీక్షించారు. అదే విధంగా ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని ప్రతి గ్రామపంచాయితికి 50 కి తగ్గకుండా కూలీలు హాజరయ్యేట్లు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు గ్రామ పంచాయతీలో హాజరై పారిశుద్ధ్య, ఉపాధిహామీ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. నర్సరీలకు సంబంధించి సమీక్ష చేసి, సూచనలు చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా దేశంలో తెలంగాణ ముందంజలో ఉన్నందున అదనపు కలెక్టర్లును ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డిఆర్డీఓ కౌటిల్య, అదనపు డిఆర్డీఓ మదన్ మోహన్, ఏపీడి నర్సింహులు, ఎఫ్ఆర్వో శ్రీనివాస్, డిపిఆర్ఇ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post