జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 మంది కూలీలకు పనులు కల్పించాలి- రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 మంది కూలీలకు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా అదనపు కలెక్టర్లకు సూచించారు.
మంగళవారం హైదరాబాద్ నుండి ఉపాధి హామీ పధకం, పల్లెప్రగతి పనుల పురోగతి పై పంచాయతీ రాజ్ కమీషనర్ శరత్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా పంచాయతీ రాజ్ సెక్రటరీ మాట్లాడుతూ జిల్లాల వారీగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రకారం లక్ష్యాలను సాధించాలని అదనపు కలెక్టర్లు , డి.ఆర్.డి.ఓ. , ఏ.పి .ఓ.లు, డి.ఎల్.పి .ఓ.లకు సూచించారు. ఉపాధి హామీ పధకం క్రింద పల్లెప్రగతిలో పారిశుద్యం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, సేగ్రిగేషన్ షేడ్స్ వంటి పలు గ్రామాభివృద్ధి పనులతో పాటు జలశక్తి అభియాన్ క్రింద నీటి సంరక్షణ వంటి పనులు చేపట్టవచ్చని, అందుకనుగుణంగా తక్షణమే కార్యాచరణ రూపొందించి పనులు చేపట్టవలసిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. డి.ఆర్.డి.ఓ. , ఏ.పి .ఓ.లు, డి.ఎల్.పి .ఓ.లు తదితర మండల అధికారులు మాసంలో కనీసం పది పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏరియా ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ యాప్ లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ-పంచాయత్ లో భాగంగా కనీసం 5 గ్రామ పంచాయితీలను మానిటరింగ్ చేస్తూ ఈ పోర్టల్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. పూర్తయిన పనులకు వారం రోజులలో పేమెంట్ చేయాలని సూచించారు. హారితహారంలో భాగంగా నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్ పై జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షిస్తూ పనులు వేగవంతం చేయాలన్నారు. ఇట్టి పనులన్నింటిని అదనపు కలెక్టర్ మానిటరింగ్ చేయాలని సూచించారు.
ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 250 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యానికి గాను 189 కిలో మీటర్లు గుర్తించి అందులో 131 కిలో మీటర్ల మేర మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ పూర్తి చేశామని , మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో 4 బృహహత్తర పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేశామని తెలిపారు .

ఈ వీడియో కాన్ఫరెన్ఫ్స్ లో ట్రైనీ కలెక్టర్ కదిరవన్ ఫలని, డి.ఆర్.డి.ఏ పీ. డీ ప్రభాకర్ , ఏ.పీ.డి నీరజ , డి.పి.ఓ. శ్రీనివాస్ రెడ్డి , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post