జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నిప్రజలకు అత్యంత చేరువ చేయాలి: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య.

ప్రచురణార్థం
ములుగు జిల్లా
నవంబర్ 24 ( బుధవారం

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నిప్రజలకు అత్యంత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మండల అభివృద్ధి అధికారులు ఆదేశించారు.

గురువారం రోజున డిఆర్దివో కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో లకు మరియు ఎంపీఓ లకుఒకరోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఈ శిక్షణా కార్యక్రమంలో అధికారులు సిబ్బంది శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఉపాది హామి పధకం ను పకడ్బందీ గాఅమలు చేయాలనీ అన్నారు.

హరితరంలో బాగంగా నాటిన  మొక్కలకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసాం అని , వాటిని  ఒక సంవత్సర భద్రంగా కాపాటినట్లు అయితే  అవి మన జీవిత కాలానికి సరిపడా పర్యావరణాన్ని ఇవ్వగలుగుతుందని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటి టాయిలెట్స్ ఏర్పాటుకు ఎం పీ డీ వో ల కృషి కి అభినందించారు. ప్రజల సంచారం అదికంగా ఉన్న ప్రదేశాలలో,బస్టాండ్స్ ,ఆసుపత్రిలు, తదితర ముఖ్య కూడలిలో నిర్మాణం చేపట్టి త్వరిత గతిన పూర్తి చేయలని అన్నారు.

జిల్లాలలో సోక్ ఫీట్స్ (ఇంకుడు గుంతలు ) నిర్మాణాలపై అధికారుల పని తీరు సరిగా లేదని కలెక్టర్ అసహానం వ్యక్తం చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని, సీజనల్ వ్యాధుల నుండి ప్రజలనురక్షించబడుతుందని , భూగర్భ జలాలు ఇంకిపోకుండా చేయుటకు ఉపయోగపడతాయని అన్నారు. సోక్ ఫీట్స్ (ఇంకుడు గుంతలు ) ఏర్పాటు చేయుటకు వార్డులవారిగా మానిటరింగ్ చేయాలని,వాటి నిర్మాణానికి ప్రణాళిక సిద్దం చేయాలనీ అన్నారు. ఈ పనులన్నీ రెండు నెలలలో పూర్తి చేయాలనీ అన్నారు. ప్రతి గ్రామంలో 5 నుండి 10 పాయింట్ సెలెక్ట్ చేసి వార్డుల వారీగా వ్యక్తిగత మరియు ఉమ్మడిగా అవసరాన్ని బట్టి నిర్మాణం చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు . మేడారం పరిసర ప్రాంతంలలో ఎక్కడైతే డ్రింకింగ్/వాష్ ఏరియాలలో వాటర్ సప్లైఎక్కువ ఉండే ప్రదేశాల్లో , స్కూల్స్, అంగన్వాడి సెంటర్స్ , మేడారం పరిసర ప్రాంతాల్లలో బాత్ రూమ్స్ ,వాష్ ఏరియాలలో ముఖ్యంగా స్కూల్స్, అంగన్ వాడి కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రధానమంత్రి ఎంప్లొయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రాం లో 35% సబ్సిడీ ఉంటుందని, 2 లక్షల నుండి  25 లక్షల బుణం మంజురుకు అవకాశం ఉందని, యువతకు అవేర్నెస్ కల్పించి జీవనోపాధి కల్పించే విదంగా చేయాలని అన్నారు.మన జిల్లా అద్భుతమైన పర్యాటక క్షేత్రాలు ఉన్నాయని, ఎక్కడైతే పర్యాటక క్షేత్రా లు ఉన్నాయో అక్కడ పర్యాటకులకు అవసరాల నిమిత్తం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా అవసరం అని అన్నారు. ప్రతి గ్రామం వారిగా, వార్డుల వారీగా ఉత్సాహవంతులైన వారిని గుర్తించి పాస్ట్ ఫుడ్ సెంటర్ ,ఐస్ క్రీమ్ పార్లర్ , ఆ ప్రాంతానికి ఏది అవసరమో అది గుర్తించి మోటివేషన్ చేయవలసిన బాధ్యత తమ పై ఉందని ఎంపీఓలకు గుర్తు చేసారు. బోగత ,లక్నవరం, రామప్ప, వాజేడు, మల్లూరు లాంటి పర్యాటక ప్రదేశాల్లలో పర్యాటకుల రద్దీ ఇంకా పెరుగుతుందని పర్యాటకులకు సౌకర్యం కల్పించే దిశగా ఐస్ క్రీమ్ పార్లర్ కావచ్చు, పాస్ట్ పుడ్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, దానిమీద ప్రణాళికలు సిద్ధం చేసి అమలయ్యే విధంగా చూడాలని అన్నారు.

ఒక యూనిట్ స్థాపించిన కలిగితే అది కొన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని, రానున్నది మేడారం జాతర మహా జాతర కి అనేక మంది భక్తులు వస్తారని వారి సౌకర్యార్థం అవసరం నిమిత్తం ప్రభుత్వ భూమి ఐన వ్యక్తిగత స్థలం లో అయిన నిబంధనల మేరకు మడిగలను(షాపులను) ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధంచేయాలని అన్నారు. స్థానికులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువత ముందుకు వచ్చినట్లయితే రెండు లక్షల నుంచి 25 లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, drdo నాగ పద్మాజా,ఎపిడి యం. వెంకట నారాయణ ,మరియు సంబందిత మండలాల ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Share This Post