జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు సమర్థవంతంగా నిర్వహించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 19, 2021ఆదిలాబాదు:-

జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన రిజిస్టర్ లు, నివేదికలు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున స్థానిక టీటీడీసీ లో ఎంపీడీఓ లు, ఎపిఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు జిల్లాలో వచ్చే వారం పర్యటించనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన వివరాలు క్రోడీకరిస్తూ సిద్ధం చేయాలనీ అన్నారు. అదేవిధంగా ఏడు రకాల రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని, అర్హులైన వారికీ జాబ్ కార్డులు అందించాలని అన్నారు. పనులు జరిగే ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేసి పూర్తీ వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా మండల కేంద్రాలలో శానిటేషన్ నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. పంచాయితీ కార్యదర్శులు గ్రామాలలో పర్యటించి శానిటేషన్ పై పర్యవేక్షణ చేసేలా చర్యలు చెప్పట్టాలని అందుకు గ్రామపంచాయితీ వారీగా సమావేశాలు నిర్వహించి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలనీ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ మాట్లాడుతూ, గ్రామాలలో ప్రణాళికలతో నిర్వహించే ఉపాధి పనులకు సంబంధించిన రిజిస్టర్ లను గ్రామపంచాయితీలో నిర్వహించాలని అన్నారు. జాబ్ కార్డుల జారీ, గ్రామసభల తీర్మానం, పనులకొరకు దరఖాస్తు, పనుల రిజిస్టర్, స్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, సామగ్రి రిజిస్టర్ లను క్రమ పద్దతిలో నిర్వహించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, తదితర రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, ఖాళీగా ఉన్న అన్ని ప్రాంతాలలో ప్లాంటేషన్ నిర్వహించి లక్ష్యాలను సాధించాలని అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, కేంద్ర అధికారుల పర్యటన సందర్బంగా గ్రామస్థాయిలో నిర్వహించే రిజిస్టర్ లను పరిశీలించాలని అన్నారు. పనులు జరిగే ప్రాంతాలలో బోర్డు ఏర్పాటు, వివరాలు నమోదు చేయాలనీ అన్నారు. కొత్త జాబ్ కార్డులు అర్హులైన కూలీలకు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, అదనపు DRDO రవీందర్ రాథోడ్, ఎంపీడీఓ లు, ఎపిఓలు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………………. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post