“జాతీయ చేనేత దినోత్సవాన్ని” పురస్కరించుకొని చేనేత కార్మికులతో ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                 తేది:07-08-2021
వనపర్తి.

ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పిలుపు:
చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు .
“జాతీయ చేనేత దినోత్సవాన్ని” పురస్కరించుకొని శనివారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన “జాతీయ చేనేత దినోత్సవ” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యం వస్తుందని, చర్మ వ్యాధులు రావని, అంతేకాక శరీరాన్ని చల్లగా ఉంచుతాయని అన్నారు. చేనేతలకు ప్రోత్సాహంలో భాగం రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత వస్త్రాలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతను అందిస్తూ ఆగస్టు 7, 2015 తేదీని ” జాతీయ చేనేత దినోత్సవం” గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఆగస్టు 7వ తేది , 1905 సం.లో కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలని స్వదేశీ ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ వివరించారు.

జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన వస్త్రాలు మన సంస్కృతికి నిదర్శనమని ,మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని అన్నారు. వనపర్తి పట్టణంలో చేనేత ఉత్పత్తులు విక్రయించడానికి దుకాణాలను ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకర్ల ద్వారా రుణ సదుపాయం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. చేనేత పరిశ్రమ లాభాలలో నడిచేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు .
అంతకుముందు పాలిటెక్నిక్ కళాశాల నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు వరకు చేనేత కార్మికులతో ర్యాలీని నిర్వహించారు.

అంతేగాక చేనేత సహకార సంఘాల ప్రతినిధులను శాలువాతో సన్మానించారు. ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం వారికి పావలా వడ్డీ కింద రూ.15,37,799/- చెక్కును, అదే విధంగా చేనేత మిత్ర పథకం ద్వారా జిల్లా చేనేత కార్మికులకు నూలు సబ్సిడీ క్రింద రూ.2,33,184/- చెక్కును అందించడం జరిగింది. వారి వారి ఖాతాలు జమ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, (లోకల్ బాడీ) అంకిత్ , జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి , ఆర్డీవో అమరేందర్, ఎంప్లాయిమెంట్ అధికారి అనిల్ కుమార్, సి పి ఓ, వెంకట్ రమణ డి ఈ ఓ, రవీందర్ డి వి ఓ జాకీర్, డి పి ఆర్ ఓ రషీద్,డిఆర్డీఓ నరసింహులు, రాజేశ్వర్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ లక్ష్మీదేవి, చేనేత & జౌళి శాఖ డి.ఓ.సతీష్ కుమార్ , ఎ.డి.ఓ.రాజేశ్వర్ రెడ్డి, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

…………
జారీ చేసిన వారు జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది

 

 

Share This Post