*జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ జి.రవి*

*జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—1

తేదీ.23.8.2021

*జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ జి.రవి*

*జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ జి.రవి*
*జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ జి.రవి*

జగిత్యాల, ఆగష్టు23:- జిల్లాలో ఆగష్టు 25 నుండి 31 వరకు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వాహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2,65,608 మంది 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వారందరికి జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో అల్బెండజోల్ మాత్రలు అందచేయాలని , కోవిడ్ కారణంగా పాటశాలలు మరియు కళాశాలు మూతపడినవి కావున ఇంటివద్ద తల్లిదండ్రుల సమక్షంలోనే తప్పక వేయించాలని ఆదేశించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్రను పొడి రూపంలో, 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఒక మాత్రను పూర్తిగా వేయించాలని అన్నారు. జిల్లాలోని 238 ఏ.ఎన్.ఎం.లు,766 ఆశా వర్కర్లు,1065 అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు వారు మాత్రలు వేసే ప్రాంతాన్ని నాలుగు రోజుల్లో నాలుగు భాగాలుగా విభజించుకొని, మిగిలిన 3 రోజుల్లో మాప్ ఆప్ గా ఇంటింటికి వెళ్లి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వంద శాతం వేయాలని , అత్యవసర పరిస్థితుల్లో 108, వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరి చొప్పున అంగన్వాడీ సూపర్వైజర్లు, సి.డి.పి.వో. లు, మెప్మా సిబ్బంది పర్యవేక్షణాధికారులుగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు సిబ్బంది అందరూ భాగస్వామ్యులు కావాలని, ఈ మాత్రల వలన ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్టులు ఏమి ఉండవువని ప్రజల్లో , తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలియచేసారు.

జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ అల్బెండజోల్ మాత్రలను 19 సంవత్సరాల లోపు పిల్లలందరికి వేయాలని, గ్రామాల్లో పట్టణంలో ముందుగా చాటింపు చేయాలని సూచించారు. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలందరికి సగము మాత్రను పొడి చేసి నీటితో కలిపి ఇవ్వాలని అన్నారు. 2 నుండి 19సంవత్సరాలలోపు పిల్లలకు ఒక మాత్ర చొప్పున వేసి పూర్తిగా నమలమని చెప్పాలని, మాత్రలను ఇచ్చే సమయంలో త్రాగు నీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మాత్రలను ఇంటి బయటనే ఉండి పిల్లలకు వేయించాలని అన్నారు. మాత్రలు వేయు సమయంలో వారి ఇంటిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నవ అనే విషయాన్ని కనుక్కోవాలని, ఎవరికైనా దగ్గు, జ్వరము, శ్వాస తీసుకొవడంలో ఇబ్బంది లాంటి కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలకు మాత్రలు వేయవద్దని తెలిపారు. ఈ లక్షణాలు ఉన్న పిల్లల వివరాలను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు తెలియచేయలన్నారు అన్నారు.

ఈ సమావేశంలో మెడికల్ సుపెరడెంట్లు, పి.డి.డి.ఆర్.డి.ఓ., డీపీఓ, డిపిఆర్ఓ, డి.డబ్ల్యూ.ఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయబడినది.

Share This Post