జాతీయ న్యాయ సేవ వారోత్సవాల కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

మంచి మార్పు కోసం అందరం కృషి చేయాలి

ప్రిన్సిపల్ జిల్లా జడ్జి యం. జి. ప్రియదర్శిని

ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకలు

పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000
సమాజంలో మంచి మార్పు రావడం కోసం అందరం కృషి చేయాలని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ యం. జి. ప్రియదర్శిని అన్నారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా, జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్నిపురస్కరించుకొని మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థ భవన్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ 1987 సంవత్సరంలో లో లీగల్ యాక్ట్ స్థాపన జరిగిందని, నవంబర్ 9, 1995 నుంచి జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఇంకా అంటరానితనం ఉందని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం అంటరానితనం నేరమని, దీన్ని రూపుమాపేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుందని, దీన్ని నియంత్రించేందుకు విస్తృత అవగాహన ప్రజలకు కల్పించాలని జిల్లా జడ్జి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేందుకు ప్రజలు సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నారని, వారిలో భయం తొలగించేందుకు అవగాహన కల్పించాలని అన్నారు. శిక్షలు పెరిగితేనే క్రైమ్ తగ్గుతుందని అన్నారు. భూ తగాదాలు తగ్గేలా చూడాలని తెలిపారు. చట్టాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తే నే కోర్టు కేసులు తగ్గుతాయని జిల్లా జడ్జి అన్నారు. చిన్న చిన్న తగాదాలు పెద్దవి కాకుండా అక్కడికక్కడే పరిష్కారం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, దీనివల్ల మంచి భవిష్యత్తు ఏర్పడుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలను వారికి వారే పరిష్కారం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సాధారణ ప్రజలు తమ సమస్యలను పరిష్కారం చేసుకోవడంతో పాటు, ఏ యే సమస్యలపై కోర్టుకు వెళ్లాలి అనే విషయాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలు, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సుజయ్ మాట్లాడుతూ పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ మారుమూల గ్రామాల ప్రజలకు న్యాయ సేవలు, సలహాలు అందిస్తున్నామని అన్నారు. డిసెంబర్ నెలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

Share This Post