జాతీయ పంచాయతీ అవార్డులకు జిల్లా వ్యాప్తంగా అప్లోడ్ పూర్తి కలెక్టర్ హరీశ్ సమక్షంలో ప్రశ్నలు, జవాబుల పత్రాలు ఫ్రీజ్

పత్రిక ప్రకటన

తేదీ : 04–11–2022
============================================
జాతీయ పంచాయతీ అవార్డులకు జిల్లా వ్యాప్తంగా అప్లోడ్ పూర్తి
కలెక్టర్ హరీశ్ సమక్షంలో ప్రశ్నలు, జవాబుల పత్రాలు ఫ్రీజ్
జాతీయ పంచాయతీ అవార్డులు (ఎన్పీఏ)లో భాగంగా మేడ్చల్ – మల్కాజిగిరి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం జిల్లాకు సంబంధించిన అవార్డుల థీమ్లు, ప్రశ్నా, జవాబు పత్రాలను జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో ఫ్రీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని 61 గ్రామపంచాయితీలో తొమ్మిది (9) థీమ్లకు సంబంధించి అన్ని విభాగాల్లో సంబంధిత ప్రశ్నలకు జవాబులతో అప్లోడ్ చేసి ఫ్రీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారిణి స్మిత, పాల్గొన్నారు

Share This Post