జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన హనుమకొండ, వరంగల్ జిల్లాలలోని ఒక్కో జిల్లాకు 27 చొప్పున మొత్తం 54 గ్రామ పంచాయతీలకు అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందచేశారు. 

Press note

Date 25-03-2023

ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన హనుమకొండ, వరంగల్ జిల్లాలలోని ఒక్కో జిల్లాకు 27 చొప్పున మొత్తం 54 గ్రామ పంచాయతీలకు అవార్డులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందచేశారు.

*మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కామెంట్స్:*

అవార్డులు పొందిన అందరికీ అభినందనలు! శుభాకాంక్షలు!!

ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 9 వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఈ అవార్డులు అందచేస్తున్నము

హనుమకొండ, వరంగల్ జిల్లాలలోని 54 గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులను ఇచ్చాం

స్థానిక స్వపరిపాలన లో పంచాయతీల పనితీరును మెరుగు పరచడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందచేస్తున్నాం

పంచాయతీల మధ్య, సర్పంచుల మధ్య పోటీ తత్వం పెరిగి, మరింత అభివృద్ధి జరగాలనేది సంకల్పం

వివిధ ప్రామాణిక సూచికల ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది

పేదరికం లేని, ఆరోగ్యవంతమైన, చైల్డ్ ఫ్రెండ్లీ, నీరు సమృద్ధిగా ఉన్న, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన, మౌలిక సదుపాయాలతో కూడిన స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, సుపరిపాలన ఉన్న, మహిళా స్నేహ పూర్వక వంటి మొత్తం 9 అంశాలలో ఒక్కో విభాగానికి 3 చొప్పున గ్రామాలను ఎంపిక చేసి, అవార్డులు ఇస్తున్నాం

సీఎం కెసిఆర్ గారు పల్లె ప్రగతి ని తెచ్చి, పంచాయతీ రాజ్ చట్టాన్ని సంస్కరించారు. పకడ్బందీగా చట్టాన్ని తీసుకువచ్చారు.

నేను అదృష్ట వంతుడిని…

ఈ సమయంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలు నాకు దక్కడం నా అదృష్టం

40 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా ఉన్న

ఇన్నేళ్లలో ఏ నిధులు కూడా మంచినీళ్ళ కే సరిపోయే వి కావు

ఇప్పటివరకు ఎవరూ ఇంతలా ఆలోచించలేదు

సీఎం గారు స్మశాన వాటికలను కూడా దేవాలయాలుగా చేసి, అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు

చెత్తతో కూడా ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా సీఎం ఆలోచించారు

నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇలా గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా ఆలోచించిన మన సీఎం కెసిఆర్ మనసున్న మహారాజు

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను తగ్గిస్తున్నారు

707 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది

600 కోట్లు ఉపాధి హామీ నుంచి రావాల్సి ఉంది

కానీ, కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది

రాష్ట్రాలకు రావాల్సిన నిధులను తగ్గిస్తున్నది25-03-2023

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇప్పటివరకు 15 వేల కోట్లు ఇచ్చారు

గతంలో గంగదేవి పల్లె కు మాత్రమే అవార్డులు వచ్చేది

అప్పట్లో ఆ గ్రామ ప్రజలు, సర్పంచ్ ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి

సిబ్బంది జీతాలు అతి తక్కువగా ఉండేది. ఇవ్వాళ 8,500 లకు పెంచుకున్న0

ఇంకా ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజలను భాగస్వామ్యం చేయాలి

కొందరు సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు

ఇంకా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి

ఇవ్వాళ గ్రామాల సర్పంచ్ ల అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని భవిష్యత్తు తరాలు చెప్పుకోవాలి

ఈ ప్రగతిని చూపెట్టిన సర్పంచ్ లు గర్వంగా భావించాలి.

పంచాయతీరాజ్ శాఖలోని అన్ని రకాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు

*రైతుల పరిహారం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు పిచ్చి, పిచ్చి గా మాట్లాడుతున్నారు*

*బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 3 వేల పరిహారం కూడా అందటం లేదు*

కానీ, మన రాష్ట్రంలో రు.10 వేలు అందుతున్నాయి

ఇప్పడు కష్టపడి పని చేస్తున్న గ్రామ పంచాయతీ లకు అదనంగా రూ.10 లక్షలు అందజేస్తామ్నారు

*మేయర్ గుండు సుధారాణి కామెంట్స్*

అవార్డు గ్రహీతలు అభినందనలు

పల్లె ప్రగతి తోనే ఈ ప్రగతి సాధ్యం అయింది

సీఎం గారి దిశా నిర్దేశం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి కృషి, పట్టుదలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది

ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్, సిబ్బంది బాగా పని చేస్తున్నారు.

హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కామెంట్స్

సీఎం కెసిఆర్ గారి వల్ల అవార్డుల పంట పండుతుంది

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సీఎం గారి ఆలోచనలకు అనుగుణంగా పని చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు

మంత్రి గారి బాటలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పని చేస్తున్నందుకు అభినందనలు

*వరంగల్ ZP చైర్ పర్సన్ గండ్ర జ్యోతి కామెంట్స్*

రాష్ట్రంలోని గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి

సీఎం కెసిఆర్ గారు పంచాయతీ రాజ్ చట్టాన్ని బలోపేతం చేశారు. అభివృద్ధికి సంకల్పించారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలే ఇందుకు దోహదం చేశాయి

సరైన సిబ్బంది, అధికారులు, సిబ్బంది, నిధులు, విధులు కల్పించారు. మంత్రి ఎర్రబెల్లి కార్యదక్షత కూడా ఇందుకు దోహదం చేసింది

వివిధ సూచీల్లో మనం ముందుండటం కూడా మనకు శుభసూచకం

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, మరింత అభివృద్ధి సాధ్యం అయ్యేలా పనులు జరగాలి

*హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య*

ఉత్తమ గ్రామ పంచాయతీలకు కొన్ని సూచీలను, మార్గదర్శకాలను కేంద్రం సూచించింది.

ఆ సూచీల్లో తెలంగాణలోని గ్రామాలు అగ్రభాగాన నిలుస్తున్నాయి

సిఎం గారి మార్గదర్శనంలో గ్రామాలన్నీ ప్రగతి గాడీలో పడ్డాయి.

ఈ పరిస్థితిని కొనసాగిస్తే చాలు… తెలంగాణ పల్లెలు దేశానికి, భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.

ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్ డీ ఓలు, డిపిఓలు, ఎంపిడీఓలు, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post