జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి బుధవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోవిడ్ నిబంధనల మేరకు గణతంత్ర దినోత్సవ వేడుకలను నిడారంబరంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాంసన్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ,జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.