తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ గురువారం కలెక్టరేట్ ఆవరణలో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
మహాత్మాగాంధీ, అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల అలంకరణ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సీతారాం, అనిల్ ప్రకాష్, భూపాల్ రెడ్డి, మోహన్ బాబు, చంద్రశేఖర్ రావు, జిల్లా కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.