జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పులఈశ్వర్

*అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారు-మంత్రి కొప్పుల ఈశ్వర్*

*ఎస్సీ గురుకులాలలో చదివి ఎంబిబిఎస్,బిడిఎస్, ఐఐటి,ఎన్ఐటిలలో సీట్లు పొందిన విద్యార్థి,విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు*

హైదరాబాద్ మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం మంత్రి 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులను పంపిణీ చేశారు.

*ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంతు నాయక్, సంయుక్త కార్యదర్శులు శారద, ప్రవీణ్, కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*

2018-19,2019-20 విద్యా సంవత్సరాలలో ఐఐటి, ఎంబిబిఎస్ కోర్సుల్లో సీట్లు పొందిన వారికి 50 వేలు,ఎన్ఐటి,బిడిఎస్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు 40 వేల చొప్పున మంత్రి చెక్కులు అందజేశారు.

ఐఐటి విద్యనభ్యసిస్తున్న వారికి ల్యాప్ టాప్స్ పంపిణీ చేశారు.

విద్యార్థినీ, విద్యార్థులకు ప్రోత్సాహాకంగా 92 లక్షల 40 వేలు మంజూరు చేయడం జరిగింది.

*ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ*

అన్ని రంగాలతో పాటు ఉన్నత విద్యలో కూడా  తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో ప్రారంభించారు

తెలంగాణలో మాదిరిగా ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఒక్కటంటే ఒకటి కూడా లేదు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,జనరల్ గురుకుల విద్యా సంస్థల ద్వారా 981స్కూళ్లలో 5 లక్షల 40 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు

వీరికి కార్పోరేట్ స్థాయిలో విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, పుస్తకాలు,యూనిఫారంలు,బూట్లు అందిస్తున్నాం

లా, ఫైన్ ఆర్ట్స్,ఫిల్మ్ మేకింగ్,సైనిక్ స్కూల్, బాలికలకు డిగ్రీ కాలేజీలు నడుపుతున్నం

మన గురుకుల విద్యార్థులు పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ ఫలితాలతో పాటు జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపుతున్నారు

ఈసారి 240 మంది విద్యార్థులు ఎంబిబిఎస్,బిడిఎస్ లో 30మంది సీట్లు పొందనున్నారు.

ఐఐటిలో-84,ఎన్ఐటిలో-62,సెంట్రల్ యూనివర్సిటీలలో-27, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో -22 మంది సీట్లు సాధించారు.

అలాగే,క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబర్చుతున్నారు.

*ఈ సందర్భంగా మంత్రి కొప్పుల,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ విద్యార్థులు, అధికారులు,సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు, అభినందించారు*

Share This Post