జాతీయ యువజన ఆవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ యువజన ఆవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ 2019 -20 సంవత్సరానికి జాతీయ యువజన అవార్డుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రాంచందర్ రావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ అభివృద్ధి, సామాజిక సేవలో ఉత్తమ సేవలందించిన అర్హులైన యువతీ యువకుల నుండి (వ్యక్తిగతంగా/స్వచ్ఛంద సంస్థలు) జాతీయ యువజన అవార్డుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లాకు చెందిన అర్హులైన యువత, యువజన సంఘాల నిర్వాహకులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు http://innovate.mygov.in//national-youth-award-2020 వెబ్ సైట్ ను చూడాలని ఆయన పేర్కొన్నారు.

Share This Post