జాతీయ రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ వేగవంతం చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆగష్టు 14, 2021ఆదిలాబాదు:-

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున మావల, జందాపూర్, భీంసరి గ్రామాల గుండా వెళ్లే జాతీయ రహదారి 44 కు ఇరువైపులా చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని నేరడి గొండ మండలం నుండి జైనథ్ మండలం వరకు విస్తరించి ఉన్న 85 కిలో మీటర్ల జాతీయ రహదారి 44 కు ఇరువైపుల  ఎవెన్యూ ప్లాంటేషన్ పద్దతిలో మొక్కలను నాటాలని, గతంలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ, చనిపోయిన మొక్కల స్థానంలో మరో మొక్కను నాటాలని సూచించారు. జాతీయ రహదారి ప్రాంతాలలో చేపట్టే ఎవెన్యూ ప్లాంటేషన్ త్వరిత గతిన పూర్తీ చేయాలనీ, సంబంధిత మండల అభివృద్ధి అధికారులు పర్యవేక్షించాలని, సాంకేతిక సహకారం, సలహాలు సూచనలు అటవీ శాఖ అధికారుల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, అటవీ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post