జాతీయ రహదారిపై రోడ్డు కి ఇరువైపులా మిగిలిపోయిన స్థలాలలో కూడా మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు తెలిపారు.

పత్రిక ప్రకటన                                                  తేది: 06-12-2021

జాతీయ రహదారిపై రోడ్డు కి ఇరువైపులా మిగిలిపోయిన స్థలాలలో కూడా మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అటవీ శాఖ అధికారులతో అవెన్యూ ప్లాంటేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి పై మూడు వరసల్లో మొక్కలు నాటేందుకు  ప్రణాళిక పూర్తి చేయడమే కాకుండా ఎలాంటి మొక్కలు నాటాలో కూడా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రతి కిలోమీటర్, రెండు కిలోమీటర్లకు మొక్కలు మార్చాలని, పచ్చదనంతో పాటు పూల మొక్కల వల్ల అందంగా, ఆకర్షణీయంగా పూల మొక్కలను నాటాలని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణపై కూడా దృష్టి సారించాలని బ్రష్ వుడ్ ఫెన్సింగ్ చేయాలని, ఎప్పటికప్పుడు మొక్కలకు నీటిని పెట్టడంపై దృష్టి సారించాలని సూచించారు. సాయిల్ టెస్టింగ్ చేసి, అక్కడి మట్టికి అనుగుణంగా మొక్కలు నాటే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. పోలీస్, పంచాయత్ రాజ్ శాఖ, అటవీ శాఖ లు సమన్వయము తో చేయాలనీ అధికారులకు ఆదేశించారు. హై వే ల పై ఉండే ధాబా ల ఆవరణలో  పరిశుబ్రంగా ఉంచుకునేటట్లు ధాబ ల యజమానులకు సూచించాలని అన్నారు. ఎర్రవల్లి చౌరస్తా లో ఉన్న షాప్ ల ముందు, పరిసరాలను  పరిశుబ్రంగా ఉంచుకునే విధంగా షాప్ ల యజమానులకు అవగాహన కల్పించాలని, సానిటేషన్ పై నిరంతరంగా దృష్టి  పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.పి.ఓ శ్యాం సుందర్, డి.ఎఫ్.ఓ రామ కృష్ణ, దేవరాజ్, సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారి చేయనైనది.

Share This Post