జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, బి. రాజేశం, జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారామ్‌తో కలిసి రోడ్డు-భవనాలు, రెవెన్యూ అటవీ శాఖలతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని రేపల్లెవాడ నుండి తెలంగాణ- మహారాష్ట్ర నరిహద్దు ప్రాంతమైన వాంకిడి వరకు చేపట్టనున్న జాతీయ రహదారి-363లో 4 వరుసల రహదారి నిర్మాణానికి అవసరమైన అటవీ, రెవెన్యూ శాఖల అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తిచేసి పనులు చేపట్టాలని తెలిపారు. 1 వేయి 140 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో షనులు చేపట్టడం జరుగుతుందని, ఇందుకు గాను 114.54 హెక్టార్ల భూమి సేకరించవలసి ఉంటుందని, సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, రోడ్డు-భవనాల శాఖ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post