జాతీయ రహదారి రోడ్డు పనులకు భూ సేకరణ చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆగష్టు 10, 2021ఆదిలాబాదు:-

జాతీయ రహదారి రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, మిషన్ భగీరథ, విద్యుత్, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ –  బేల జాతీయ రహదారి 353(బి) నిర్మాణాలకు 37 హెక్టార్ల భూ సేకరణ చేపట్టవలసి ఉందని, అందుకు కావలసిన ప్రతిపాదనలు జాతీయ రహదారుల అధికారులతో సంప్రదించి సిద్ధం చేయాలనీ సూచించారు. ఈ భూ సేకరణలో విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ శాఖలకు సంబంధించిన వాటిని తరలించేందుకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….  జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post