జాతీయ రహదారి 167 రోడ్డు విస్తరణ పాటు భారత్ మాల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు

జాతీయ రహదారి 167 రోడ్డు విస్తరణ పాటు భారత్ మాల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.  గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  భారత్ మాల, జాతీయ రహదారి 167 పనుల పై సంబంధిత అధికారులు, రెవెన్యూ, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా భారత్ మాల భూసేకరణ, సేకరించిన భూమికి సంబంధించి 3డి ఆన్ లైన్ అప్లోడ్ విషయంలో అధికారులను ప్రశ్నించారు.  ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎంతవరకు భూసేకరణ పనులు పూర్తి అయ్యాయి అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఇందుకు జాతీయ రహదారి అథారిటీ డి.జి.యం కె.పి. సరస్వతి సమాధానం ఇస్తూ నారాయణపేట జిల్లాలోని 19 గ్రామాల గుండా వెళుతున్న భారత్ మాల జాతీయ రహదారికి సేకరించాల్సిన 227 హెక్టార్ల భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని, డి.పి.ఆర్ కు 3డి ఆన్లైన్ నోటిఫికేషన్ అప్లోడ్ చేసే కార్యక్రమం ఇప్పటి వరకు 14 గ్రామాలోని 169 హెక్టార్లు పూర్తి చేసినట్లు తెలియజేసారు.  మిగిలిన 5 గ్రామాలకు సంబంధించి సైతం శనివారం లోపు పార్టీ చేస్తామని కలెక్టర్ కు వివరించారు. స్పందించిన కలెక్టర్  3డి నోటీస్  అప్లోడ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే   సంబంధిత భూమి హక్కుదారులకు అవార్డులు పాస్ చేసి పరిహారం చెలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.  అదేవిధంగా జాతీయ రహదారి 167 పై సమీక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రొడ్డు విస్తరణ తో  పాటు హరితహారం మొక్కలు నాటే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్ పై ఉందని తెలిపారు.  గడువులోగా పనులు పూర్తి చేసి రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు 6 వేల పై చిలుక మొక్కలు నాటవలసి ఉందన్నారు. జాతీయ రహదారి  విస్తరణలో  అక్కడక్కడ  దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, విగ్రహాలు అడ్డువస్తున్న విషయాన్ని జాతీయ రహదారుల డి.ఈ. రమేష్ బాబు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  స్పందించిన కలెక్టర్ ఆయా దేవాలయ, ప్రార్థనల కమిటీ సభ్యులతో మాట్లాడి తగు చర్యలు టీసుకోవాలని ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు ను ఆదేశించారు.  త్వరితగతిన చర్యలు తీసుకొని రోజువారీ నివేదిక తనకు పంపాల్సిందిగా ఆదేశించారు.

ఈ సిమీక్ష సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జాతీయ రహదారుల అథారిటీ డి.జి.యం కె.పి. సరస్వతి, టీమ్ లీడర్ రాజ్ కుమార్ ,  జాతీయ రహదారుల డి.ఈ. రమేష్ బాబు, జిల్లా ల్యాండ్ సర్వేయర్ మూసా, ఏ.డి. సర్వేయర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post