జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు….జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా, మే 17, బుధవారం
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు….జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు, బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయ మినీ సమావేశ మందిరంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ సీతారాం తో కలిసి రోడ్డు సేఫ్టీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెంబర్తి నుండి కరుణాపురం వరకు విస్తరించి ఉన్న జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు, జిల్లాలో (8) ప్రమాద స్థలాలను గుర్తించమని అధిక శాతం వ్యతిరేక దిశలో వాహనదారులు రావడం, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు, జనగామ సెంటర్ నుండి నెల్లుట్ల ఫ్లైఓవర్ నుండి మొండ్రాయి వరకు పెంబర్తి, చాగల్లు, చిన్న పెండ్యాల, కరుణాపురం, స్టేషన్గన్పూర్, పల్లగుట్ట, రాఘవాపూర్ తదితర ప్రదేశాలలో ప్రజల సౌకర్యార్థం, స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్లు, సైన్ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు,
రోడ్ల భవనాల శాఖ, పంచాయతీరాజ్ రోడ్ల విస్తరణ శాఖ, జాతీయ రహదారుల విభాగం, మున్సిపల్ రోడ్ల విస్తరణ శాఖ, పోలీస్, రవాణా శాఖ, ఆర్టీసీ, 108, సంబంధిత విభాగాలు కలిసి రహదారుల వెంబడి ప్రమాద స్థలాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని హైవేలపై ఉన్న యూటర్న్ లను మత్రమే ప్రజలు ఉపయోగించుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ ను పక్కాగా పాటించే విధంగా ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు, రోడ్ల వెంబడి ఇబ్బందికరంగా ఉన్న ముండ్ల పొద చెట్లను తొలగించాలని పంచాయతీరాజ్ శాఖ ను, రోడ్లపై ఉన్న చెక్ డ్యాములను చిన్న కల్వర్టు లను మరమ్మత్తులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు,
ఈ సమావేశంలో నేషనల్ హైవే ఈ ఈ అధికారి విద్యాసాగర్, ఆర్ అండ్ బి ఈఈ సిహెచ్.హుస్సేన్, స్టేషన్ ఘనపూర్, జనగామ ఏసీపీలు రఘుచందర్, దేవేందర్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రజిత, ఆర్టీసీ డిఎం జోత్స్న, పంచాయతీరాజ్ డి ఈ, నేషనల్ హైవే కన్సల్టెంట్ శ్రీనివాస్, 108 సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post