జాతీయ రహదారుల నిర్మాణ సంబంధ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

పత్రికా ప్రకటన
నల్గొండ,సెప్టెంబర్ 25.జాతీయ రహ దారుల నిర్మాణ సంబంధ భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో ఎన్. హెచ్ 167 కల్వకుర్తి టు కోదాడ,ఎన్. హెచ్ 565 నకిరేకల్ టు నాగార్జున సాగర్,నార్కట్ పల్లి- అద్దంకి రాష్ట్ర రహదారి నిర్మాణ భూ సేకరణ,నిర్మాణాల సర్వే సంబంధిత అంశాల పై సమీక్షించారు.ఆర్&బి,విద్యుత్,మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్,నేషనల్ హై వేస్ ఈ ఈ ఖమ్మం, కల్వకుర్తి ,రెవెన్యూ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఎన్. హెచ్ 167 జాతీయ రహదారి నిర్మాణ సంబంధించి పెదవూర మండలం లో తొలగించ వలసిన ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు మార్చటానికి అంచనాలు వెంటనే సమర్పించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.రాష్ట్ర రహదారి భూ సేకరణ కు జారీ చేసిన అవార్డు కు సంబంధించి భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ఆర్&బి శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్. హెచ్ 167 రహదారి నిర్మాణం కు సేకరించిన భూమిని ఎన్. హెచ్.అధికారులకు రెవెన్యూ తహశీల్దార్ లు వెంటనే అప్పగించాలని ఆయన కోరారు.ఈ సమావేశం లో నల్గొండ డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post