జాతీయ రహదారుల పనులను అవగాహనతో చేపట్టాలి…

ప్రచురణార్థం

జాతీయ రహదారుల పనులను అవగాహనతో చేపట్టాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 13

జాతీయ రహదారుల పనులను అవగాహనతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం క్యాంపు కార్యాలయంలో నాగపూర్ నుండి మచిలీపట్నం వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి హైవే పనులను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో ఐదు మండలాల లోని 18 గ్రామాల మీదుగా వెళ్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులలో మార్పులు చేర్పులు ఉంటాయని అందుచేత అవగాహనతో పటిష్టంగా చేపట్టాలన్నారు జాతీయ రహదారుల లో అటవీ శాఖ , దేవాదాయశాఖ, భూదాన్ భూములు ఉంటే నమోదు చేయాలన్నారు అదేవిధంగా కల్వర్ట్ బ్రిడ్జిలు బోర్ వెల్స్ పంటలు విద్యుత్ లైన్స్ వంటి తదితర నిర్మాణాలపై ఉద్యాన, విద్యుత్ నీటిపారుదల వ్యవసాయ పంచాయతీ రాజ్ ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూ ఎస్ తదితర శాఖల నుండి నివేదిక సమర్పించాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ కొమరయ్య కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు సంజీవ్ జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు దుర్గాప్రసాద్ ఐదు మండలాల తహసీల్దార్లు వివేక్ విజయ్ కుమార్ రఫీ కోమలి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post