జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిబి. సుజయ్

రాజీ పడదగిన కేసులు అన్నిటికీ పరిష్కారం

కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవంలో జిల్లా కోర్టు సెషన్స్ జడ్జ్ ఎం.జీ. ప్రియదర్శిని

00000

రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలు ఇతరత్రా కేసులను ఇరుపక్షాల సమ్మతితో జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం దొరుకుతుందని జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జ్ ఎం జి ప్రియదర్శిని అన్నారు.

జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ఆమె జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవ సదన్ భవన్ లో ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంజీ ప్రియదర్శిని మాట్లాడుతూ
ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈనెల 11వ తేదీన శనివారం జాతీయ లోక్ అదాలత్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న 3500 కేసుల పరిష్కారానికి వీలుంటుందని జడ్జి తెలిపారు. కాగా సుమారు ఐదు వేల (5000) కేసుల వరకూ లోక్ అదాలత్ కు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావా లు, కుటుంబ తగాదాలు, మోటారు వాహనాల చట్టం కు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, చిట్ ఫండ్ కేసులు ఇతరత్రా కేసులను ఇరుపక్షాల సమ్మతితో జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం చేయబడునని జిల్లా జడ్జి తెలిపారు. కక్షిదారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని జడ్జి తెలిపారు. లోక్ అదాలత్ లో సమస్యలు పరిష్కరించకుంటే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని అన్నారు. కక్షసాధింపు, మాట పట్టింపుల తో కేసులు వేయవద్దని కక్షిదారులకు సూచించారు. కోర్టులో కేసులు తేలడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని అలాగే అధిక ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకొని లోక్ అదాలత్ లలో సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సుజయ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు, ఏసీపీ మదన్ లాల్, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post