జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : జడ్జి నందికొండ నర్సింగ రావు…

జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి : జడ్జి నందికొండ నర్సింగ రావు…

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయసే వాధికార సంస్థ వరంగల్ ఆధ్వర్యంలో ఈనెల 10 తేదీ శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులలో ఇతర మండలాలలో నర్సంపేట, ములుగు, మహబూబాబాద్, జనగామ, పరకాల, తొర్రూరు కోర్టులలో నిర్వహించబడుతుంది అని జిల్లా జడ్జి నందికొండ నర్సింగ్ రావు అన్నారు…

ఈ జాతీయ లోక్ అదాలత్ ను కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, నేరుగా కోర్టు ప్రాంగణంలో గానీ లేదా వర్చువల్ సమావేశం ద్వారా గానీ పరిష్కరించే విధంగా అన్ని వసతులను/సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. కనుక కక్షిదారులు తమ వీలునుబట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, ప్రీ- లిటిగేషన్ కేసులు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నాం అని వారు అన్నారు. కావున ఈ నేల 10వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకోవాలని అని కోరారు…

Share This Post