జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలి…

ప్రచురణార్థం

జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలి…

మహబూబాబాద్, నవంబర్ 26.

జాతీయ విపత్తు లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో ఎన్ డి ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్ అధ్యక్షతన జాతీయ విపత్తుల సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నదులు చెరువులు ఉన్నందున ఆకస్మికంగా కురిసే భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగడం వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున జాతీయ విపత్తుల పై ముందస్తు ప్రణాళిక అవసర మన్నారు.

జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇద్దరు యువకులను ఎంపిక చేసి జాతీయ విపత్తు పై శిక్షణ ఇవ్వాలన్నారు.
జాతీయ విపత్తుల బృందం శిక్షణ కొరకు బయ్యారం చెరువు ఎంపిక చేసిందని శనివారం ఉదయం 10 గంటలకు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం నీళ్ళల్లో మునిగి పోతున్న వారిని కాపాడటం వంటి ఈ అంశాలపై జాతీయ విపత్తుల బృందం ప్రదర్శిస్తున్న అందున ఆసక్తిగల యువకులు పాల్గొనాలన్నారు .
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ కొమరయ్య, బయ్యారం నీటిపారుదల అధికారి బి కృష్ణ జిల్లా ఫైర్ ఆఫీసర్ భగవాన్ రెడ్డి సెక్షన్ ఆఫీసర్ రాజేందర్ పోలీసు అధికారులు జాతీయ విపత్తుల బృంద సభ్యులు శివ కృష్ణ తదితరులు పాల్గొన్నారు
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post