జాతీయ విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా యువత శిక్షణ పొందాలి ….. అదనపు కలెక్టర్ కొమరయ్య

ప్రచురణార్థం

జాతీయ విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా యువత శిక్షణ పొందాలి ….. అదనపు కలెక్టర్ కొమరయ్య

బయ్యారం
మహబూబాబాద్, నవంబర్-27:

జాతీయ విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా యువత శిక్షణ పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ కొమరయ్య కోరారు.

శనివారం బయ్యారం మండలం పెద్ద చెరువులో జాతీయ విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఎన్. డి.ఆర్.ఎఫ్. అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ…

జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయని, వాగులు, వంకలు పొంగి పొర్లి జనజీవనం అస్తవ్యస్తంగా మారడం రాకపోకలు స్తంభించి పోవడం జరిగిందన్నారు. అంతేగాక వ్యవసాయ పనులు కు వెళ్లి భారీ వర్షాలతో వరదలు రావడం ఇండ్లకు చేరుకోవాలనే ఆతృతలో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు.

ఇక నుండి అటువంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలనుసారం ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకోవాలో జాతీయ విపత్తుల బృందం శిక్షణ ఇస్తున్నందున యువత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.

ఎన్. డి. ఆర్. ఎఫ్. కానిస్టేబుల్ శివ క్రిష్ణ,  విజయవాడ 10వ ఎన్. డి. ఆర్. ఎఫ్. బృంద సభ్యులచే జిల్లాలోని ప్రతి గ్రామంలో ఇద్దరు యువకులను ఎంపిక చేసి జాతియ విపత్తుపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని  ఎన్. డి. ఆర్. ఎఫ్. ఇన్స్పెక్టర్ ముఖేష్ కుమార్  తెలిపారు .

ఎన్. డి. ఆర్. ఎఫ్. బృందం  యువతీ, యువకులకు బయ్యారం చెరువులో ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ తిలకించారు. శిక్షణ పొందిన వారు ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు, వరదలు సంభవించినప్పుడు అపదలో వున్న వారిని రక్షించాలని కోరారు.  

అనంతరం శిక్షణ వివరాలను వివరిస్తూ, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో చేపట్టవలసిన ముందు జాగ్రత్తలు, చర్యలపై మాక్ డ్రిల్, డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు.  

ఈ కార్యక్రమంలో బయ్యారం ఎంపిడిఓ చలపతిరావు,బయ్యారం, గూడూరు, కొత్తగూడ, నర్సింహులపేట, గార్ల తహసీల్దార్ లు నాగభవాని, శైలజ, నరేష్, ఇమ్మానియల్, స్వాతిబిందు,
ఎన్. డి. ఆర్. ఎఫ్. బృందం సభ్యులు శివ కృష్ణ ఇతర బృంద సభ్యులు, నీటిపారుదల శాఖ డి.ఈ.కృష్ణ, అగ్నిమాపక శాఖ అధికారి భగవాన్ రెడ్డి, సెక్షన్ ఫైర్ అధికారి రాజేందర్ పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post