జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.

జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి,  ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు  నుండి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష,  ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

 

సి.ఎస్. మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుటకు  సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి(ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

 

ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్ లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్, ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.  ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్ లో దేశ భక్తి పెంపోందించే కార్యక్రమాలు  టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్ లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.

 

జిల్లా నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీహర్ష   మాట్లాడుతూ,  ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు తరలించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసామని, రేపు మధ్యాహ్నం  జిల్లా నుండి  వాహనం బయలు దేరుతుందని తెలిపారు.  గాంధీ సినిమా ప్రదర్శన కోసం జిల్లాలో  5 సినిమా థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని, రేపటి వరకు లింక్ డౌన్ లోడ్ పూర్తవుతుందని తెలిపారు.  వజ్రొత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమాల అమలుకు అందించిన సూచనలు యథావిధిగా పాటిస్తామని తెలిపారు.  జిల్లా అధికారులతో  కేమిటి మీటింగ్ నిర్వహించామని తెలిపారు.

 

వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

 

ఈ వీడియో సమావేశంలో జెడ్పీ సి. ఈ. ఓ. విజయ నాయక్, డిపి ఓ శ్యాం సుందర్,  డి ఆర్ డి ఓ, నాగేంద్రం   డి.ఈ. ఓ సిరాజుద్దీన్,    డి పి ఆర్ ఓ  చెన్నమ్మ, మున్సిపల్ కమిషనర్  జానక రామ్ సాగర్,వరలక్ష్మి , ఏ ఓ ఆజం అలీ,  ఎల్లయ్య , ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయబడినది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Share This Post