జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ :: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ :: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు

563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన

వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్

————————————-

జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణంలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి(ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.

ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి, వేడుకల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్. ఖీమ్యా నాయక్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, డీఆర్డీఓ మదన్ మోహన్, డీపీఓ రవీందర్, డీఈఓ రాధాకిషన్, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉపేందర్ రావు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————

Share This Post